08-01-2026 12:00:00 AM
కాంగ్రెస్ పార్టీ కార్యాలయని ప్రారంభించిన.. వజ్రేష్ యాదవ్
శామీర్ పేట్ , జనవరి 7: మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి మూడు చింతలపల్లి పది ఏండ్లల్లో ఒక్క ఇల్లు నిర్మించారో దమ్ముంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని వజ్రేష్ యాదవ్ అన్నారు. బుధవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్ల రెడ్డి మూడు చింతలపల్లి పేద ప్రజలకు ఒక్క ఇల్లు అయిన నిర్మించార దమ్ముంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని ప్రశ్నించారు.
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు తమ వంతు కృషి చేయాలన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పీసరి మైపాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఆర్టీఎ నెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గోనె మహేందర్ రెడ్డి, బాలకృష్ణ, జేయల పాండు పాల్గొన్నారు.