5 August, 2026 | 1:54 AM

చిన్నారి సర్జరీ విజయవంతం

05-08-2026 12:00 AM

ఆఫ్రికా పాపకు మెడికవర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యుల చికిత్స

హైదరాబాద్, ఆగస్టు 4(విజయక్రాంతి): పుట్టుకతోనే తీవ్రమైన గుండె లోపాలతో బాధపడుతున్న ఆఫ్రికాకు చెందిన ఎనిమిది నెలల చిన్నారి మైజా జిబ్రిల్ బిషీర్‌కు మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ నిపుణులు విజయవంతంగా అత్యాధునిక గుండె శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించా రు. ప్రస్తుతం చిన్నారి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్‌కు సిద్ధమైంది. పుట్టుకతోనే చిన్నారి గుండెలో అనేక క్లిష్టమైన లో పాలు ఉండటంతో గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తప్రసరణ సక్రమంగా జరగడం లేదు. సకాలంలో చికిత్స అందకపోతే ఈ ప రిస్థితి ప్రాణాపాయంగా మారే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

చిన్నారి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అమోల్ గుప్తా నేతృత్వంలో, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ప్రియాంక పాటిల్ బృందం జూలై 14న బైడైరెక్షనల్ గ్లెన్ అనే అత్యాధునిక గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ శస్త్రచికిత్స ద్వారా ఊపిరితిత్తులకు రక్తప్రసరణ మెరుగుపడి, గుండెపై ఒత్తిడి తగ్గి, శరీరానికి ఆక్సిజన్ సరఫరా గణనీయంగా పెరుగుతుంది. 

ఆపరేషన్ అనం తరం చిన్నారికి ఎక్కువసేపు వెంటిలేటర్ అ వసరం లేకుండానే స్వయంగా శ్వాస తీసుకునే స్థితికి చేరుకుంది. అనంతరం కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (సీఐసీయూ)లో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించగా చిన్నారి వేగంగా కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. శిశువుల్లో తరచూ శ్వాస తీసు కోవడంలో ఇబ్బంది, పాలుతాగకపోవడం, బరువు పెరగకపోవడం, పెదాలు లేదా గోళ్లు నీలం రంగులో కనిపించడం, తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలను నిర్ల క్ష్యం చేయకుండా వెం టనే పీడియాట్రిక్ కార్డియాక్ నిపుణులను సంప్రదించాలని డాక్టర్ అమోల్ గుప్తా  సూచించారు.