04-02-2026 01:38:07 AM
క్యాన్సర్ దినోత్సవం వేళ సర్వైవర్ల విజయపథం
ప్రారంభ దశలో గుర్తిస్తే సంపూర్ణ ఆరోగ్యం: మెడికవర్ హాస్పిటల్స్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (ఫిబ్రవరి 4) సందర్భంగా సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో యునైటెడ్ బై యూనిక్ అనే నినాదంతో ప్రత్యే క అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు (సర్వైవర్లు) ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభ దశలో గుర్తింపు, సకాలంలో చికిత్స ఎంత ముఖ్యమో తమ అనుభవాల ద్వారా వివరించారు. డా. నివేద్‌రావు బల్మూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ.. ‘దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసు లు నమోదవుతున్నాయి.
గణాంకాల ప్రకారం, ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్స ర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే 50 శాతం కంటే ఎక్కువ కేసులు నివారించగలిగేవి లేదా పూర్తి గా నయం చేయగలిగేవి’ అని పేర్కొన్నారు. డా.గౌతమ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ..ప్రస్తుతం అందుబాటులో ఉన్న కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక చికిత్సల ద్వారా ప్రారంభ దశలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ నుంచి కోలుకున్న సర్వైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్స్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేశారు.