calender_icon.png 4 February, 2026 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టాలకు గత పాలకులే కారణం

04-02-2026 01:37:50 AM

  1. విచారణ కమిటీ నియమించి, చర్యలు తీసుకుంటాం
  2. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో నార్మూల్ సంస్థకు పూర్వ వైభవం తెస్తాం
  3. చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 3: హయత్‌నగర్‌లోని నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి సంస్థ మదర్ డైయిరీ (నార్ముల్)లో నష్టలకు కారణం గత పాలకవర్గాల చైర్మన్లు కారణమని  ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూ దన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన సమాధానం ఇస్తూ మంగళవారం నార్మల్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. గుత్తా జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న హయాంలో మిగులు బడ్జెట్‌లో ఉన్న మదర్ డైయిరీని నష్టాల్లోకి నెట్టారన్నారు.

13 ఏండ్ల కాలంలో నష్టాలను దాచిపెట్టి, లాభాల్లో ఉన్నదని బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారని తెలిపారు. ఎన్‌ఈడీపీ తో కుదుర్చుకున్న ఒప్పం దం నుంచి నార్మూల్ తప్పించి, దాదాపు రూ, 70 నుంచి రూ,80 కోట్ల నష్టానికి తెచ్చాడని మధుసూదన్‌రెడ్డి ఆరోపించా రు. జితేందర్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, వీటిపై విచారణ కమిటీ నియమించి, నిజాలను ప్రజలకు తెలియజేస్తానని చెప్పారు. మదర్ డైయిరీని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకోవడానికి తమపై అసత్య ఆరోపణలు చేసి, రైతు సంఘాల్లో చీలిక తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల బిల్లులు, ఉద్యోగుల వేతనాలు, అప్పులు తీర్చడానికి జితేందర్‌రెడ్డి నార్ముల్ సంస్థకు రూ.35 కోట్లు ఇస్తే తమ పాలకవర్గం రాజీనామా చేస్తామని మధుసూదన్‌రెడ్డి సవాల్ చేశారు. ఇటీవల రాజీనామా చేసిన ఎండీ కృష్ణ సాయంతో అనేక కుంభకోణాలు చేశారని ఆరోపించారు. డైయిరీలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిటీతోపాటు అఖిలపక్ష నాయ కులకు అవకాశం ఇవ్వాలని కోరుతామన్నారు. నార్మూల్ సంస్థను కాపాడడానికి త్వరలో ఎన్‌ఈడీపీతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మె ల్యే, ఎంపీ, మంత్రులతో కలిసి చర్చించి మదర్ డైయిరీకి పూర్వ వై భవం తీసుకురావడానికి కృషి చేస్తా నని అన్నారు. సమావేశంలో ఎండీ గఫార్, డైరెక్టర్లు లక్ష్మీనర్సింహరెడ్డి, నర్సింహరెడ్డి, కస్తూరి పాండు, రాంరెడ్డి, జంగ య్య తదితరులు పాల్గొన్నారు. కాగా వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల చేపట్టిన ఆందోళన కొనసాగుతున్నది. చైర్మన్ వచ్చిన విషయం తెలుసుకున్న ఉద్యోగులు, కార్మికులు పాలక వర్గాన్ని అడ్డుకుని, తమకు వేతనాలు చెల్లించాలని డిమాం డ్ చేశారు. తమకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, తమ కుటుంబాలు పస్తులు ఉం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.