2 July, 2026 | 2:53 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

సూర్యవంశీ సంచలనం

29-04-2025 01:21 AM
  1. 35 బంతుల్లోనే శతకం 
  2. గుజరాత్‌పై రాజస్థాన్ ఘన విజయం

జైపూర్, ఏప్రిల్ 28: ఐపీఎల్ 18వ సీజన్‌లో పెను సంచలనం నమోదైంది. మంగళవారం జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చిచ్చర పిడుగు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధిం చాడు తద్వారా ఐపీఎల్లో అత్యంత వేగంగా శతకం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఫలితంగా రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. గిల్ (84)రాణించాడు. అనంతరం రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. సూర్యవంశీ (101) విధ్వంసంతో రాజస్థాన్ సునాయాసంగా గెలుపొందింది.