2 July, 2026 | 3:45 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి

02-07-2026 02:39 PM

బోథ్, జులై 2 విజయక్రాంతి):  మాది రైతు ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తున్నారని బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. గురువారం బోత్ మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలకు హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేపట్టిన పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిందన్నారు సబ్సిడీపై స్ప్రింగ్ క్లాసు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఉద్యానవన శాఖ ద్వారా అవసరమైన వసతులను రైతులకు కల్పిస్తుందన్నారు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు .

కార్యక్రమంలో బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్న టీపీసీసీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమయ్య మహేందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి చంటి బూత్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహ దాస్ మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ మార్కెట్ డైరెక్టర్ రాజు రెడ్డి మాజీ డైరెక్టర్ అబ్రార్ ఆత్మ డైరెక్టర్లు రహీముద్దీన్ కుచలాపూర్  ఉపసర్పంచ్ అరుణ్ రెడ్డి సీనియర్ నాయకులు మహమ్మద్ అసిఫ్ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ అనుపట్ల సంజీవ్ నాయకులు అచ్యుతానంద రెడ్డి బీరం రవి గడ్డల నారాయణ భీమ బుచ్చన. తదితరులు పాల్గొన్నారు