2 July, 2026 | 3:21 PM

Breaking News

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •  

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

02-07-2026 02:41 PM

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్ : ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు నిర్మించిన ఘనత నిర్మిస్తున్న చరిత్ర పాలన ప్రభుత్వానికి సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎదిర డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల సాకారం కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంతింటి హామీలు మాటలకే పరిమితమై, పేదల కలలు కలగానే మిగిలిపోయాయని విమర్శించారు. ఉత్తితి హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నిజం చేస్తోందని అన్నారు. నిర్మిస్తున్న ఇళ్లు కేవలం గోడల సముదాయం కాదని, అవి పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని ఆయన చెప్పారు.  ప్రతి పేద కుటుంబం సంతోషంగా జీవించేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు  చేస్తోందని ఆయన తెలిపారు.  భవిష్యత్తులో గుడిసెలు లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజలకు అండగా నిలిచి వారికి సేవ చేస్తుందని, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలన్నారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్  గుమ్మాల మమత శ్రీనివాస్, కార్పొరేటర్ లలిత భానుచందర్  ప్రజలు పాల్గొన్నారు.