2 July, 2026 | 3:13 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్

02-07-2026 02:17 PM

బోథ్,జూలై 2 (విజయక్రాంతి): గోండు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భవిష్యత్తు తరాలకు భాషను అందించడమే లక్ష్యంగా పాటుపడాలని ఐటిడిఏ ఏపీవో మాత్రం భాస్కర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో రాయి సెంటర్ సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న గోండి భాషను పరిరక్షించేందుకు 20 పదాలతో రూపొందించిన పుస్తకం అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.

వై సిటీ ద్వారా జరిగే ట్రైనింగ్ సెంటర్లను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఐదుగురు సభ్యుల తో కూడిన యూత్ స్పెషల్ యాప్ ద్వారా పుస్తకాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు విద్యార్థులను పాఠశాలకు పంపే బాధ్యత వారి తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ పంద్రం సుగుణ సార్ మేడి ఆడేం భీమ్రావు న్యాయవాది పందరం శంకర్ ఉప సర్పంచ్ ఆత్రం మోహన్ పటేల్ తురసం నీలకాంతరావు మాజీ సర్పంచ్ తొడ సం గోపాల్ ప్రధానోపాధ్యాయులు శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు