ఐదు రాష్ట్రాల ఓట్లపై ఉత్కంఠ
డాక్టర్ తిరునహరి శేషు :
18వ లోక్‌సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. ఒక దశాబ్దం తర్వాత జాతీయ రాజకీయాలలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవటం.. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాని దక్కించుకోవ డం గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో కీలక పరిణామం. లోక్ సభ ఎన్నికలు నేర్పిన పాఠంతో రాజకీయ దిద్దుబాటు చర్యలలో భాగంగా బీజేపీ హర్యానా మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ లాంటి కీలక రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో తిరుగులేని విజయాలను సాధించింది.
మరలా దేశం లో పశ్చిమబెంగాల్, తమిళనాడు.కేరళ, అస్సాం, పాండిచ్చేరి లాంటి ఐదు రాష్ట్రాల శాసనసభలకు కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే విపక్షాలు బలంగా ఉన్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా భవిష్యత్తు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించేవే కాబ ట్టి రాజకీయ పార్టీలు గెలుపు కోసం తమ వ్యూహాలకి పదును పెడుతున్నాయి.
పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళంలో అధి కారంలో ఉన్న టీఎంసీ, డీఎంకే, ఎల్‌డీఎఫ్‌లు మరొకసారి అధికారాన్ని నిలబె ట్టుకుంటాయా! బీజేపీ అస్సాంతో పాటు సంకీర్ణ భాగస్వామిగా ఉన్న పాండిచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతాన్ని మళ్లీ నిలబెట్టుకుని అధికారంలో లేని రాష్ట్రాలలో ఎంత మేరకు విస్తరించగలుగుతుంది, ఎక్కడా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కేరళ, అస్సాం, పాండిచ్చేరిలో విజయం సాధించగలుగుతుందా! లేదా అనే అంశాలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతుంది.
దీదీ, -స్టాలిన్ పట్టు నిలిచేనా!
పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన బీజేపీ ఒక దశాబ్ద కాలంగా ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయటానికి రాజకీయంగా అన్ని అవకాశాలు వినియోగిం చుకుంటున్న ఫలితాలు మాత్రం రావటం లేదు జేపీపీకి నిరాశే ఎదురవుతుంది. ఈ రెండు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నేతలైన మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ బీజేపీకి ఒక కొరకరాన్ని కొయ్యలుగా మారా రనే చెప్పాలి.
2011 నుంచి బెంగాల్‌లో ఆప్రతిహత విజయాలు సాధిస్తున్న దీదీ, గత శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులో తిరుగులేని విజయాలు సాధిం చిన స్టాలిన్ మరొకసారి బెంగాల్, తమిళనాడులో విజయం సాధిస్తే దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతం కావడానికి ఈ ఇద్దరు నేతలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలలో దీదీని, స్టాలిన్‌లను ఓడించటానికి బీజేపీ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది.
తమిళనాడులో ఒంటరిగా డీఎంకేని ఓడించటం సాధ్యం కాదని బీజేపీ మరొకసారి అన్నాడీఎంకేతో జట్టు కట్టి డీఎంకేని ఓడించటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న 81 లోక్ సభ స్థానాలలో ఆధిపత్యం సాధించాలంటే దీదీని, స్టాలిన్‌లను ఓడించాలని బీజేపీ గట్టిగానే తన వ్యూహాలకి పదును పెడుతుంది. కానీ ఆ రెండు రాష్ట్రాలలో రాజకీయ బలాలను పరిణామాలను చూస్తుంటే మరొకసారి దీదీ స్టాలిన్‌లు అధికారం చేజెక్కించుకునే అవకాశాలే కనపడుతున్నాయి.
అదే జరిగితే దీదీ, స్టాలి న్‌లు జాతీయ రాజకీయాలలో కీలకమైన నాయకులుగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీదీ, స్టాలిన్ ప్రభుత్వాలపై ప్రజ లలో కొంత వ్యతిరేకత కనిపిస్తున్న వారి ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారి పార్టీలు బలంగా ఉండటంతో మరొకసారి గెలుపు సాధిస్తామనే ధీమా వ్యక్తం అవుతుంది.
బెంగాల్‌లో విజయం సాధించి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వెళ్తామని మమతా బెనర్జీ చేసి న ప్రకటన చూస్తుంటే బెంగాల్, తమిళనా డు ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నా యనే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
బీజేపీ విస్తరణ సాధ్యమేనా!
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి బలమైన పోటీ ఎదురవుతున్న బీజేపీ అధికారంలో ఉన్న అస్సాం లో మరొకసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని బీజేపీ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. కీలక రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడు, కేరళంలో గెలవకపోయినా బలమైన పార్టీగా ఎదగాలనే బీజేపీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి అనేది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
ఒక దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఓటు బ్యాంకుని గణనీయంగా పెంచుకుందనేది కాదనలేని వాస్తవం. బీజేపీ బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగటమే కాదు.. అధికారానికి అతి చెరవలోకి రాబోతుందని సర్వేలు చెబుతున్నప్పటికీ అధికారం దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
అలా గే తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి చేతులు కాల్చుకున్న బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని డీఎంకేని అధికారంలోకి రాకుండా చూడాలనే తన ఎత్తుగడ కూడా ఫలించే అవకాశా లు కనిపించడం లేదు. టీ.వీ.కే. విజయ్ ఎన్‌డీఏతో జట్టు కట్టి ఉంటే తమిళనాడు లో రాజకీయ పరిణామాలు వేరే విధంగా ఉండేవి. కానీ తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఎన్‌డీఏ కూటమికంటే ఎస్‌పీఏ కూటమి బలంగా కనిపిస్తుంది.
అనూహ్యపరిణామాలు జరిగి అస్సాంలో పాండిచ్చే రిలో బీజేపీ అధికారాన్ని కోల్పోయి బెంగాల్, తమిళనాడు, కేరళంలో బలం పెంచుకోలేకపోతే రాజకీయంగా బీజేపీకి నష్టం జరుగుతుంది. దేశవ్యాప్తంగా విపక్షా లు పుంజుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో 116 లోక్ సభ స్థానాలు ఉంటే కేవలం 24 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే బీజేపీకి ప్రాతినిథ్యం దక్కింది. అలాగే 824 శాసనసభ స్థానాలు ఉంటే బీజేపీకి దక్కినవి కేవలం 147 మాత్రమే కాబట్టి దేశంలో బీజేపీ మరింత బలమైన పార్టీగా ఎదగటానికి ఈ రాష్ట్రాలలో విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య
దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ గత కొన్ని ఏండ్లుగా రెండు అడుగులు ముందు కి.. నాలుగు అడుగులు వెనుకకిలాగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అద్భు త విజయాలు ఏమి సాధించలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష హోదాని దక్కించుకోవడం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో దక్కిన విజయం కొంత ఊరటనిచ్చినా హర్యానా, మహారాష్ట్రలో ఓటమి ఆ పార్టీని మరింత దయనీయస్థితిలోకి నెట్టివేసింది.
దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటానికి ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యూహాకర్తలు ఉపయోగించుకోవాలి. కేరళ, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తే రాజకీయంగా కాంగ్రెస్‌కి కలిసి వస్తుంది. ఈ మూడు రాష్ట్రాలలో కేరళలో కాంగ్రెస్‌కి విజయ అవకాశాలు ఉన్నట్లుగా, అస్సాంలో కాంగ్రె స్ పుంజుకుంటున్నట్లుగా ప్రీపోల్ సర్వేలు ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఈ మూడు రాష్ట్రాలలో సాధించే విజయాలపైనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
దేశ రాజకీయాలు ప్రభావితం
ఐదు రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల ఫలితాలు దేశ రాజ కీయాలను ప్రభావితం చేయబోతున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. బెంగాల్‌లో దీదీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయంగా బీజేపీ వ్యతిరేక శక్తుల బలం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అలా కాకుండా ఇందుకు భిన్నమైన ఫలితాలు వస్తే బీజేపీ దేశంలో మరింత బలమైన పార్టీగా దేశ రాజకీయాలను శాసించే అవకాశాలు లేకపోలేదు. నియోజకవర్గాల పునర్విభజన చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు అమలు కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి.
వ్యాసకర్త సెల్: 98854 65877




