3 నుంచి 5వరకు ‘మీ సేవ’ నిలిపివేత
మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 3 రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 5 ఉదయం 8 గంటల వరకు ‘మీ సేవ’ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. ఈ విషయాన్ని మీసేవ వినియో గదారులు గమనించాలని కోరారు. సర్వర్ నిర్వహణ పనుల నేపద్యంలో మీసేవ ఆన్లైన్ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ తెలిపారు.
సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రత వ్యవస్థల సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్లైన్ సేవలు డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవని తెలిపారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని, సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగానే,ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్తులో వేగవంతమైన అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటన లో వెల్లడించారు.




