22 June, 2026 | 2:02 PM

Breaking News

ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన

22-06-2026 01:23 PM

నేరేడుచర్ల,జూన్ 22(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా,నేరేడుచర్ల మండలం పుల్గంబండ తండ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో,  ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి. ఎస్  నిధులతో,సంఘ బంధం భవనము 10 లక్షలు , అంగన్వాడీ కేంద్రం 12 లక్షలు, సిసి రోడ్ 5 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకట్ రెడ్డి ఎంపీడీవో డి సోమసుందర్ రెడ్డి , ఎంపీవో ఇ. నాగరాజు,  ఏ ఈ పి ఆర్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పుల్గంబండ తండ గ్రామ సర్పంచ్ బానోతు మంగమ్మ , ఉప సర్పంచ్ బానోతు మంగ, వార్డ్ మెంబెర్స్ బానోతు రంగమ్మ, బానోతు నాగరాజు, రామావత్ సైదమ్మ, రామావత్ కోటేశ్వర్ రావు అంగోతు చిన్ని మరియు పంచాయతీ కార్యదర్శి మచ్చ నర్సింహా,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.