బీజేపీతోనే సుస్థిర అభివృద్ధి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
గడ్డిఅన్నారం డివిజన్లో బీజేపీలో చేరికలు
ఎల్బీనగర్, మార్చి 29 : బీజేపీతోనే భారతదేశంలో సుస్థిర అభివృద్ధి జరుగుతుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో ’సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ స్ఫూర్తిని చూసి అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న సంస్కరణల రథచక్రాలు.. తెలంగాణ ను కూడా ‘వికసిత్ భారత్’ దిశగా కొత్త పుంతలు తొక్కిస్తున్నాయన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిర్వహించిన కార్యక్రమం లో రాంచందర్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దాసరి జయప్రకాశ్ నాయకత్వంలో వివేకానంద నగర్ బస్ స్టాప్ వద్ద జరిగిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సమక్షంలో టీమ్ వివేకానంద, షార్య ఉత్సవ మండల్ సభ్యులు, వివిధ కాలనీలకు చెందిన యువత, మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలు ప్రజ ల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, ముఖ్యం గా యువత పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం శుభపరిణామమన్నారు.
గడ్డిఅన్నారం ప్రాం తంలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కృషితోనే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారని తెలిపారు. గడ్డిఅన్నారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ బద్దం సుభాష్‌రెడ్డి సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గడ్డిఅన్నారం ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ ఇన్ చార్జి సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, చిలుకూరి రాంరెడ్డి, చింతల సురేందర్ నాథ్ యా దవ్, మాజీ కౌన్సిలర్లు బండి నిర్మల, సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు, వివిధ విభా గాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




