30 March, 2026 | 2:35 AM

దేశానికి బలం బలగం యువతే

30-03-2026 12:15 AM
  1. గవర్నర్ శివప్రతాప్ శుక్లా

పిజ్జా, బర్గర్లు వదిలేయండి: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పీపుల్స్ ప్లాజాలో ‘భారత్ రన్ 2026’

హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): దేశానికి బలం బలగం యువతే అని, భావి భారతం బాగుండాలంటే యువ త ఫిట్‌గా ఉండాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘పిట్ ఇండియా’ స్ఫూర్తితో ఆదివారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం పీపుల్స్ ప్లాజా వద్ద ‘భారత్ రన్ 2026’ నిర్వహించారు. కార్యక్రమాన్ని గవర్నర్ శుక్లా, మాజీ రాష్ట్రపతి వెంకయ్యనా యుడు జెండా ఊపి ప్రారంభించారు.

మూ డు విభాగాల్లో రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ సంకల్పంతో ప్రధాని ముం దుకు వెళుతున్నారని అన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియాలంటే యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. యువ భారత్ పేరుతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.

పిజ్జా, బర్గర్లు వదిలేసి పోషకాలు ఉండే బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలు తినాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లా డుతూ.. ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన యువతలో వచ్చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఫిట్ ఇండియా పేరుతో నిర్వహిం చిన ఈ రన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పల్లవి గ్రూప్ సీఈవో యశస్వి మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ కార్యక్రమం ఈ రోజు మొదలైంది కాదని, ఈ రోజుతో ఆగేది కాదని,నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఫ్యూచర్ ఇండియా పిలుపుతో పాల్గొన్న ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు శర్వానంద్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు,  పలువురు రాజకీయ, సీని ప్రముఖులు, బీజేపీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.