calender_icon.png 4 February, 2026 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీకి స్వరూపానంద గుడ్‌బై

28-11-2024 03:18:02 AM

అమరావతి, నవంబర్ 27: విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర త్వరలో ఏపీని వీడనున్నారు. ఆయన రుషికేశ్ వెళ్లి అక్కడే ఎక్కువ సమయం గడపనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏపీ డీజీపీకి రాసిన లేఖలో పీఠం మేనేజర్ స్పష్టం చేశారు. స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ఎక్స్ క్యాటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో మేనేజర్ కోరారు.

ఇకపై ఆయన రుషికేశ్‌లో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడిం చారు. కాగా, గతంలో వైసీపీ ప్రభు త్వం ఆయనకు వై క్యాటగిరీ భద్రత కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ప్లస్ వన్ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.