11 August, 2026 | 1:22 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

బైబిల్ మీద ఒట్టు.. ట్యాపింగ్ పచ్చినిజం

19-06-2025 12:43 AM
  1. రాజకీయంగా నన్ను అణగదొక్కేందుకు స్కెచ్ వేశారు..
  2. విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తా..
  3. జగన్ బంధం ముందు రక్తసంబంధం చిన్నబోయింది
  4. ఫోన్ ట్యాపింగ్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి
  5. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్టణం, జూన్ 18: తెలంగాణలో తన ఫోన్‌తో పాటు తన భర్త, దగ్గరివాళ్ల ఫోన్లన్నీ ట్యాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘బైబిల్ మీద ప్రమా ణం చేసి చెప్తున్న..ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఫోన్ ట్యాపిం గ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా..’ అని స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్టణంలో షర్మి ల మీడియాతో మాట్లాడారు..

అప్పుడు ఏపీ సీఎం గా ఉన్న వైఎస్ జగ న్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు కలిసే ఫోన్ ట్యాపింగ్‌కు ప్లాన్ చేశారన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా అణగదొక్కేందుకు స్కెచ్ వేశారని, ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డే తనకు చెప్పారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలను కూడా తనకు వినిపించారని చెప్పారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా.. అంటే అనుమానమేనన్నారు.

జగన్ తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారన్నా రు. కేసీఆర్, జగన్ బంధం వల్ల రక్తసంబంధం చిన్నబో యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేశారని, తాను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదని కుట్రలు చేశారన్నారు.

అందులోభాగంగా ఫోన్ ట్యా పింగ్ కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్‌కు సంబంధంలేని అంశమని, కేసీఆర్ కో సం తనను తొక్కిపెట్టాలని చూశారన్నారు. ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోవాలని, రెండు రాష్ట్రా ల ప్రభుత్వాలు ఫోన్ ట్యా పింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని ఆమె కోరారు.