7 April, 2026 | 3:39 PM

డా. ఉన్నం జ్ఞాన సుందరి పర్యటన షెడ్యూల్

07-04-2026 01:56 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ చైర్ పర్సన్ డా. ఉన్నం జ్ఞాన సుందరి  ఏప్రిల్ 14వ తేదీ పర్యటన కార్యక్రమం ఖరారైంది. ఉదయం 08 గంటలకు తిరుపతిలో నేషనల్ వైస్ చైర్మన్ ఎస్. సుధాకర్ ని పరామర్శించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు గూడూరులో ఆత్మీయులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. తరువాత ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బాలు ఆధ్వర్యంలో నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం కావలి మరియు నెల్లూరులో జరిగే సమావేశాలకు హాజరై పలు సామాజిక, మానవ హక్కుల అంశాలపై చర్చించనున్నారు.