17 April, 2026 | 11:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

తీపి జ్ఞాపకాలు

18-05-2025 12:00 AM

ఈ వస్తువులు గుర్తున్నాయా? 

ఇల్లు మారిన ప్రతిసారీ కొంత పాత సామాను తూకానికి వెళ్లిపోతుంది. కొత్త ఎలక్ట్రా నిక్ వస్తువు కొన్నప్పుడుల్లా ఏదో ఓ వస్తువు ట్రంకుపెట్టెను ఆశ్రయిస్తుంది. కొత్త నీరు వచ్చి పాత నీటిని తరిమేయడం లాంటి వ్యవహారమే ఇది. అలా అటకెక్కిన సామగ్రిలో.. ప్రతి ఇత్తడి బిందె నొక్కుల వెనుకా, ప్రతి స్టీలు క్యారేజీ సొట్టల వెనుకా, ప్రతి రాగి గిన్నె మీద చెక్కిన పేరు వెనుకా.. ఓ నోస్టాల్జియా ఉంటుంది. అందులో కొన్ని జేజమ్మ నుంచి నానమ్మకు, నానమ్మ నుంచి అమ్మకు, అమ్మ నుంచి శ్రీమతికి వారసత్వంగా అందినవీ ఉంటాయి. వాటిని వెలకట్టలేం. తూకానికేసి చిన్నబుచ్చలేం. 

కావిడి పెట్టె..

పాతకాలంలో ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెళ్తుంటే ఆమె వస్తువులు, బట్టలు అన్నీ ఇందులో సద్దుకుని పట్టుకెళ్లేది. దీన్ని కావడిలో వేసి పట్టుకెళ్లేవారు. సారితో సహా. సారి కావిళ్ల మీద పట్టుకెళ్లేవారు. అందుకే సారి కావిళ్లని పేరు వచ్చింది. ఈ పెట్టెను టేకుతో తయారు చేస్తారు. ఈ పెట్టెను కనక రంగం పెట్టె, రంగూన్ పెట్టె అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ పల్లెల్లో అక్కడక్కడ దర్శనమిస్తుంది. ఈ పెట్టె మధ్యలో చిన్న చిన్న అరలు ఉంటాయి.