17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చరిత్రలో నేడు

18-05-2025 12:00 AM

అగ్ని పర్వతం విస్ఫోటనం

1980 మే 18న అమెరికాలోని మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద విస్ఫోటన. విస్ఫోటనంలో 57 మంది మరణించారు. సుమారు 7,000 జీవాలు చనిపోయాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద కారణంగా సుమారు ఒక బిలియన్ డాలర్ల నష్టం జరిగిందని పరిశోధకులు వెల్లడించారు. 

అణుపరీక్షకు 50 ఏళ్లు

1974 మే18న భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు పోఖ్రాన్‌లో భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే తొలిసారి. ఈ అణు పరీక్షకు ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ’ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. 

వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ అవేర్‌నెస్ డే

ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఎయిడ్స్ నివారణ, హెచ్‌ఐవి వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని 1997లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రారంభించారు. మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ‘హెచ్‌ఐవి వ్యాక్సిన్ మాత్రమే ఎయిడ్స్ ప్రమాదాన్ని తగ్గించగలదు, అంతిమంగా తొలగించగలదు’. అన్నారు.

మక్కా మసీదు పేలుళ్లకు.. 18 ఏళ్లు పూర్తి

హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్లకు నేటితో 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పేలుడుకు తొమ్మిది మంది మరణానికి, 58 మందికి పైగా గాయాలకు కారణమైన ఘటన ఇది. 2007, మే 18న మక్కా మసీదు వజుఖానా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో ఊహించే లోపే అక్కడంతా అల్లకల్లోలంగా మారింది. ఐఈడీ బాంబు పేలుడుతోనే ఈ ఘోరం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.