17-05-2025 07:12:53 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పోటీల్లో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అందాల భామలు పర్యటిస్తున్నారు. ఇప్పటికే రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదగిరి గుట్ట, భూదాన్ పోచంపల్లి, పిల్లలమర్రి, ఏఐజీ ఆసుపత్రి వంటి ప్రముఖ ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీదారులకు శనివారం క్రీడల పోటీ నిర్వహించారు. పోటీదారులు యోగా భంగిమలను అభ్యసించి, ఆపై బ్యాడ్మింటన్, చెస్, ఇతర ఆటలలో పోటీపడారు.
అనంతరం ఇవాళ సాయంత్రం రామోజీ పిల్మ్ సిటీలో 108 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటిస్తున్నారు. అధికారులు, రామోజీ పిల్మ్ సిటీ ప్రతినిధులు అతిథులకు సంప్రదాయ పద్దతిలో ఘనస్వాగతం పలికారు. రామోజీ పిల్మ్ సిటీ సైనేజ్ వద్ద గ్రూప్ ఫోటోలు దిగిన సుందరీమణులు. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతాసిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ నిఘా ఉంచారు. రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పోటీదారులకు ఘన స్వాగతం పలికారు.