calender_icon.png 9 June, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

08-06-2025 12:00:00 AM

పాన్‌ధాన్

పూర్వీకులు వినియోగించిన వస్తువులు, ఆనాటి కళలు, వారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి నేటి తరం యువతకు. పాతకాలం నాటి వస్తువులను కొన్ని ఇళ్లల్లో చూసినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకమనే చెప్పాలి. అమ్మమ్మలు.. తాతలు ఉపయోగించిన పాన్‌ధాన్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తుంది కొన్ని గ్రామాల్లో.. పాన్‌ధాన్‌ను తమలపాకులు, సున్నం, వక్కల కత్తెర, వక్కలు భద్రపరిచేందుకు ఉపయోగించే పెట్టె. ఆ పెట్టె గత స్మృతులకు ఓ అందమైన జ్ఞాపకం. 

ఊత

చేపల వేట కోసం ఉపయోగించే బుట్టను ఊత అంటారు. ఈ ఊత చూడటానికి ఒక బుట్ట మాదిరి కనిపిస్తుంది. సన్నటి పుల్లలతో.. పొందికగా అల్లిన బుట్ట ఊత. చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఊత సహాయంతో చేపలను పట్టి భద్రపరచవచ్చు. వాగుల్లో పారే నీటిలో.. ఊతను గట్టిగ అదిమిపట్టడంతో చేపలు ఊతలో పడతాయి. ఇప్పటికీ పల్లెల్లో అక్కడక్కడ దర్శనమిస్తుంది.