08-06-2025 12:00:00 AM
ప్రపంచ సముద్ర దినోత్సవం
జీవ వైవిధ్యంలో సముద్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కొన్ని లక్షల రకాల జీవులు సముద్రంలో జీవిస్తాయి. సముద్రాలను కాలుష్యం కోరల నుంచి కాపాడాలనే సదుద్దేశంతో 2008 జూన్ 8న ఐక్యరాజ్య సమితి ఏటా జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. సముద్రాల రక్షణపై ముఖ్యంగా ఐరోపా దేశాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
తొలి అంతర్జాతీయ విమానం
1984, జూన్ 8న దేశీయ విమానయాన సంస్థ తన అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించింది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం జూన్ 8న తొలి విమానం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. కెప్టెన్ కెఆర్ గుజ్దార్ కమాండ్‌గా 35 మంది ప్రయాణికులతో ఈ విమానం మన దేశం జూన్ 8న ముంబై నుంచి బయలుదేరినా విమానం జూన్ 10న లండన్‌లో తొలిసారి ల్యాండ్ అయింది.
బెస్ట్ ఫ్రెండ్స్ డే
జాతీయ బెస్ట్ ఫ్రెండ్స్ డేను ప్రతి సంవత్సరం జూన్ 8న జరుపుకొంటారు. ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్‌కు బహుమతులు ఇవ్వడం.. కలిసి మాట్లాడుకోవడం వంటివి చేస్తారు. ఇది స్నేహం ఒక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుసుకోవడానికి.. ఫ్రెండ్షిప్లో మంచి రిలేషన్‌ను పెంచుకోవడానికి ఈ రోజును నిర్వహించుకుంటారు.
ఆల్ ఇండియా రేడియో
1936లో భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్క్‌ను ‘ఆల్ ఇండియా రేడియో’ గా పేరు మార్చారు. ఈ మార్పు జూన్ 8న, 1936 అంటే ఇదే రోజు అధికారికంగా ఆల్ ఇండియా రేడియో పేరు ప్రకటించింది. ముందు దీన్నే ఇండియన్ స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ అని పిలిచేవారు. ఈరోజు ఆల్ ఇండియా రేడియో అని పేరు మార్చారు. ఇది మనదేశపు అధికారిక రేడియో ప్రసార సంస్థ. ప్రస్తుతం ఆకాశవాణి అని కూడా పిలుస్తున్నారు.