28 May, 2026 | 2:48 AM

ప్రతి గ్రామానికి టీ--ఫైబర్ నెట్

28-05-2026 01:40 AM

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి) : టీ-ఫైబర్ ద్వారా మండలం నుంచి ప్రతి గ్రామానికి రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడం, స్పష్ట మైన విధానం ఏర్పాటు చేయడంపై కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు.

అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్(ఏబీపీ) కింద తెలంగాణలో టీ--ఫైబర్ ప్రాజె క్టు అమలుపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఏబీపీ సజావుగా అమలు చేసే దిశగా సీఎం కొన్ని కీలక అంశాలను సింధియా దృష్టికి తీసుకువెళ్ళారు. అ మలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోనున్నారు.