భారత్‌కు తహవ్వుర్ రాణా!
18-08-2024 01:34 AM
వాషింగ్టన్, ఆగస్టు 17: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, పాకిస్థాన్ వ్యాపారి తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అభ్యంతరాలు ఏమీ లేవని అమెరికా అప్పీల్స్ కోర్టు తీర్పు చెప్పింది. 2008లో ముంబైపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు చేయటానికి ఇతడే ప్రణాళిక వేశాడని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా జైల్లో ఉన్న అతడిని అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో కోరుతున్నది. తాజాగా అమెరికా 9వ సర్యూట్ అప్పీల్స్ కోర్టు అతడి అప్పగింతపై సానుకూలంగా తీర్పు చెప్పింది. అమెరికా భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ఇందుకు అనుమతి ఇస్తుందని ప్రకటించింది. దీంతో అతడిని త్వరలోనే భారత్‌కు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.




