7 July, 2026 | 2:45 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

ఆర్టీసీ విలీనంపై చర్యలు తీసుకోండి

24-10-2024 02:21 AM

మంత్రి శ్రీధర్ బాబుకు టీఎంయూ వినతి

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేతలు మంత్రి శ్రీధర్‌బాబుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ అయిన మంత్రి శ్రీధర్‌బాబు ఆర్టీసీ హామీలన్నింటినీ మ్యానిఫెస్టోలో ఉంచినందుకు టీఎంయూ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

త్వరగా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్‌గౌడ్, యూనియన్ నేతలు యాదయ్య, ఆర్‌ఎన్ రెడ్డి తదితరులు కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని మంత్రి తెలిపారు.