15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

18-02-2026 12:00 AM

దోమకొండ, ఫిబ్రవరి 17, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని  ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఎస్ ఎస్ కె కేంద్రం, వై ఆర్ జి లింక్ వర్కర్స్ సంయుక్త ఆధ్వర్యంలో  మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో  వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పలు ఆరోగ్య  విషయాలపై  ఆయా సంస్థల ప్రతినిధులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు.  ఐసీటీసీ కౌన్సిలర్ మేక నాగరాజు, ఎస్ ఎస్ కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ లు హెచ్‌ఐవి, ఎయిడ్స్, సుఖ వ్యాధులు, హెచ్ బి ఎస్‌AG, హెచ్ సి వి, ఆర్ బి ఎస్, ఎం పి,  డెంగ్యూ, చాతి సమస్యలు,  టిబి లక్షణాలు, 1097 సేవల గురించి అవగాహన కల్పించారు.  కామారెడ్డి ప్రభుత్వ   ఆసుపత్రిలో ఆయా సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, టి ఓ టి లు అల్లాడి రమేష్, తిరుపతి, యాకూబ్, పి రమేష్, ఎస్ ఎస్ కె ఔట్రిచ్ వర్కర్లు కృష్ణమూర్తి, శ్వేత, లింక్ వర్కర్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.