17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ డేలో ప్రతిభ చాటిన నిజామాబాద్ విద్యార్థులు

18-02-2026 12:00 AM
  1. మార్చ్ ఫాస్ట్‌లో ప్రథమ బహుమతి 

అభినందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి) : ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని దోమలగూడలో గల ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పోరట్స్ డేలో నిజామాబాద్ జిల్లా చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. స్పోరట్స్ డే మార్చ్ ఫాస్ట్ లో అగ్రస్థానంలో నిలిచి మొదటి బహుమతిని దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చిన్నారులకు  అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి స్పోరట్స్ డే లో పాల్గొనేందుకు  నిజామాబాద్ జిల్లా నుండి తరలివెళ్లిన 35 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు మార్చ్ ఫాస్ట్ లో ప్రతిభను ప్రదర్శించి ప్రథమ బహుమతి దక్కించుకోవడం ఎంతో గొప్ప విషయం అని, జిల్లాకు ఇది గర్వకారణం అని కలెక్టర్ హర్షం వెలిబుచ్చారు.