calender_icon.png 21 January, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమీకృత వ్యవసాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

05-12-2024 12:03:38 AM

భైంసా (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ ఉపాధిహామీ పథకం, ఐకేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమీకృత వ్యవసాయ పథకాన్ని ముథోల్ నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామారావుపటేల్, డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి అన్నారు. ముథోల్ మండలం తరోడాలో బుధవారం సమీకృత వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన ఫిష్‌పాండ్, ఫారంపాండ్, క్యాటిల్, గోట్ షెడ్‌లను ప్రారంభించారు. వ్యవసాయంతో పాటు ఇటువంటి అనుబంధ వ్యవసాయ పథకాల ద్వారా రైతులకు అదనపు ఆధాయం సమకూరుతుందన్నారు. ఈజీఎస్, ఐకేపీ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అలాగే కుభీరు మండలం డొడర్నలో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.3.54కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే రామారావుపటేల్ భైంసాలో తెలిపారు. పనులు త్వరలో పూర్తిచేస్తామని  ఆ ప్రాంత గ్రామాల రైతులకు లోవోల్టేజీ సమస్య తీరుతుందన్నారు.