calender_icon.png 21 January, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌలు రైతుల హక్కుల కోసం సంఘటిత పోరాటాలు

05-12-2024 12:00:00 AM

ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4(విజయక్రాంతి): కౌలు రైతుల హక్కుల కోసం సంఘటిత పోరాటాలు నిర్వహిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్, సామాజిక కార్యకర్త డాక్టర్ వీ.రుక్మిణీరావు, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, తదితర వక్తలు అన్నారు.

బుధవారం ఇందిరా పార్క్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్‌లో కౌలు రౌతులు పాల్గొని తమ గొంతు వినిపించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు వారి సమస్యలను జ్యూరీ ముందు తమ సమస్యలను వివరించారు. విస్సా కిరణ్ కుమార్, పశ్య పద్మ , టీ సాగర్, వీ ప్రభాకర్, పెద్దారపు రమేశ్ పాల్గొన్నారు.