భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి..
కోదాడ: భూ భారతి రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి(Congress Party Mandal President Tumati Varaprasad Reddy) అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ అడ్లూరు గ్రామాల రైతులకు, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలు ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కోదాడ తాహసీల్దార్ వాజిద్ అలీ, పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, ఆర్ఐలు రాజేష్, జగదీష్, సీనియర్ అసిస్టెంట్ శశిధర్, ఇర్ల నరసింహారెడ్డి, తుమాటి నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి, కుక్కడపు సైదులు నాగరాజు, సోమపంగు గ్రామ శాఖ అధ్యక్షుడు రఫీ, శ్రీనివాసరావు రెండు గ్రామాల రైతులు గ్రామల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






