10-06-2025 10:15:05 PM
మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామపంచాయతీలో స్పెషల్ డ్రైవ్ డే నిర్వహించారు. ఇందులో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు సమావేశమై ఇంటింటికి తిరిగి పరిశుభ్రత స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్(MPDO Ramesh Deen Dayal) విచ్చేసి మాట్లాడుతూ... అందరికీ అవగాహన కల్పించనైనది గత సంవత్సరం పరిశుభ్రత అంటురోగాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలుగా ప్రత్యేక పారిశుధ్యం కార్యక్రమంలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రాథమికంగా 306 ఇండ్లలో అవసరము ఉన్నదిగా సర్వేలో గుర్తించడం జరిగింది.
డ్రై డే లో భాగంగా ఇంట్లో ఉన్న ఖాళీ కుండలు కొబ్బరి చిప్పలు రేకు డబ్బాలు టైర్లు చెత్తాచెదారము 10 ట్రాక్టర్ల చెత్త కలెక్షన్ చేయనైనది విష జ్వరాలపై మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఇంటింటికీ తిరిగిఅవగాహన కల్పించినారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినయ్ కుమార్, పల్లె దావకాన డాక్టర్ వైష్ణవి, సూపర్వైజర్ జయమ్మ ,హెల్త్ అసిస్టెంట్ రామకృష్ణ, లింగయ్య.సుచరిత. మండల పంచాయతీ అధికారి నరేష్ పంచాయతీ కార్యదర్శులు రామ్ నాయక్, సంతోషం, సైదులు, జ్యోతి, చంద్రశేఖర్, ఆశ వర్కర్లు మల్టీపర్పస్ వర్కర్లు అందరూ పాల్గొన్నారు.