19-12-2025 01:06:03 AM
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్18 ( విజయక్రాంతి): ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.గురువారం కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ గా మంచి అవకాశం వచ్చిందని పదవిని వినియోగించి ప్రజలకు ఎల్లప్పుడూ అం దుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు.
నియోజకవర్గంలో తన బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపే గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల అపారమైన విశ్వాసాన్ని కాపాడాలని ఆయన వర్గీయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.