19-12-2025 01:07:26 AM
ఎమ్మెల్యే సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిక...
తలమడుగు, డిసెంబర్ 18 (విజయక్రాం తి): ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామా ల అభివృద్ధి కోసం పాటు పడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ నియోజకవర్గం లోని వివిధ గ్రామ పంచాయతీలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఎక్కువ శాతం గెలుపొందడం జరిగిం దని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
ఇటీవల వివిధ గ్రామాల్లో గెలుపొందిన సర్పంచులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, అభినందించారు. అదేవిదంగా తలమడుగు మండలం లోని అర్లి కే, సకినాపూర్ మాజీ సర్పంచ్ మెస్రం పునాజీ, గ్రామ పటేల్ రాజు పటేల్ తో పాటు యువకులు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పునాజీ మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ నాయకులపై నమ్మకం లేక, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌పై విశ్వాసంతో పార్టీలో చేరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, నిమ్మల గజానాన్,బొజ్జ ప్రవీణ్,జువ్వక నర్సింగ్, సతీష్ రెడ్డి, బత్తుల శ్రీకాంత్, సురేందర్ రెడ్డి, భూమారెడ్డి,అశోక్ రెడ్డి, పురుషోత్తం ఉన్నారు.