calender_icon.png 20 May, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

20-05-2025 06:44:26 PM

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) అన్నారు. మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని భిక్కనూర్, రాజంపేట, దోమకొండ, కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి మండలాలలో ఆయా గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ పథకం కింద లబ్ధిపొందిన లబ్ధిదారులకు అందజేశారు. 

భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 25 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రాజంపేట, దోమకొండ బిబిపేట్ మాచారెడ్డి పాల్వంచ రామారెడ్డి మండలాల్లోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మారెడ్డి, ఆయా మండలాల బిజెపి నాయకులు పాల్గొన్నారు.