calender_icon.png 21 May, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగ్విజయంగా ప్రారంభమైన ఎఫ్ఎల్ఎన్ 5 రోజుల శిక్షణ కార్యక్రమం

20-05-2025 06:35:40 PM

కామారెడ్డి (విజయక్రాంతి): వేసవి సెలవుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ ప్రాథమిక స్థాయి శిక్షణ కార్యక్రమం కామారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం ఎంఈఓ శోకత్ అలీ(MEO Shaukat Ali) అధ్యక్షతన, రిసోర్స్ పర్సన్ ల పర్యవేక్షణలో అట్టహాసంగా ప్రారంభమైంది. సమావేశాన్ని ఉద్దేశించి ఎంఈఓ మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా బోదనల్లో మార్పులు చేసుకుంటూ, నాణ్యమైన విద్యను అందించడానికి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సబ్జెక్ట్ ల MRP లు రాములు, మహిపాల్, దామోదర్ సంజీవ్, మాధురి, రాములు, గోపాల్, చంద్రశేఖర్, లింగంపేట్ మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు, MRC సిబ్బంది పాల్గొన్నారు.