calender_icon.png 21 May, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో ఒకరు మృతి

20-05-2025 06:56:19 PM

భైంసా (విజయక్రాంతి): మండలంలోని సుంకిలి గ్రామానికి చెందిన ముత్యం(40) విద్యుత్ షాక్ తో మంగళవారం మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. గ్రామంలో ఇస్త్రీ షాపు నడిపిస్తున్న ముత్యం దుస్తులను ఇస్త్రీ చేసే సమయంలో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మహిళను కాపాడిన పోలీసులు

బాసర మండల కేంద్రంలో గోదావరి నదిపై ఉన్న వంతెన పైనుండి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్న మహిళను బాసర పోలీసులు మంగళవారం కాపాడారు. ముదురు మండల కేంద్రనికి చెందిన లక్ష్మీ అనే మహిళ కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బాసర గోదావరి వద్ద ఒంటరిగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ మోహన్ సింగ్ అక్కడికి వెళ్లి మహిళతో మాట్లాడి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.