22 April, 2026 | 7:19 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి

20-09-2025 12:00 AM

మైనార్టీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్

నిర్మల్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అరులైన క్రైస్తవ మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ర్ట క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో ఆయన సమీ క్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్బం గా చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని క్రైస్తవు లు అభివృద్ధి సాధించాలని అన్నారు. జిల్లా లోని ఆయా నియోజకవర్గాలలో చర్చి నిర్మాణాల కోసం స్థలాల కేటాయింపు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, క్రైస్తవుల కుల, వివాహ ధ్రువీకరణ పత్రాల మంజూరు, సమాధుల కోసం స్థలాల కేటాయింపు తదితర అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అరులైన క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖాధికారు లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.  క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు తమ సమస్యలను కమిషన్ చైర్మన్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకల్యాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, అసోసియేట్ పాస్టర్లు, జిల్లా స్థాయి క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.