20-09-2025 12:00:00 AM
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్
కామారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కామారెడ్డి బారసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటరామ్ రెడ్డి, గజ్జల బిక్షపతి, చింతల గోపి, మాయ సురేష్, తదితరులు పాల్గొన్నారు.