పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయక త్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన బిజెపి కార్యకర్తలు పోరాడాలని బిజెపి చీఫ్ రామ్ చందర్రావు బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పం డిత్ దీన్ దయాల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా హామీలను పక్కనపెట్టి ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్రలు పన్నుతుందని తెలిపారు. భాజపా నాయకులు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాల కోసం దేశ రక్షణ కోసం పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి నాగేష్ జిల్లా పార్టీ అధ్యక్షులు రితీష్ రాథోడ్. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి, పార్టీ నాయకులు సత్యనారాయణ గౌడ్, అయ్యన్న గారి భూమయ్య, అంజు కుమార్ రెడ్డి, చంద్రకాంత్, రావుల రామనాథ్, చిన్నారెడ్డి ఉన్నారు.






