15 April, 2026 | 4:17 PM

పంట కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు

14-04-2026 01:23 AM

బేల, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): శనగ పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడెక్కారు. మార్కెట్‌కు పంటను తీసుకువచ్చి రోజుల తరబడి పడిగాపులుకాస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని బేలలో రైతులు ఆందోళన బాట పడ్డారు. శనగ పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు.

బేల సబ్ మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్ల పరిమితి కోటా ముగిసిందని అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. అయితే అధికారులు మాత్రం తమ కోటా పూర్తి అయిందని కోనుగోళ్లను నిలిపివేయడం సరికాదన్నారు. పూర్తి స్థాయిలో రైతుల వద్ద నుంచి శనగ పంట కొనుగోళు చేయాలని,లేని పక్షంలో బుధవారం పెద్దఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు.