calender_icon.png 23 February, 2026 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్, డిప్యూటీ మేయర్‌గా బాధ్యతల స్వీకరణ

23-02-2026 01:18:30 AM

మంచిర్యాల, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా ధర్ని మదూకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య మహేష్ లు ఆది వారం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నగరాభివృద్ధికి కట్టుబడి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన మేయర్, డిప్యూటీ మేయర్ అడుగులు వేయాలని కోరారు. బాధ్యతలు చేపట్టిన మేయర్, డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ తమపై ఎంమ్మెల్యే పెట్టిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తామని, అవినీతి రహిత పాలన సాగిస్తూ, ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.