27 June, 2026 | 2:20 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

సూపర్ హీరో లుక్ కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నా..

10-08-2024 12:05 AM

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఇమ్రాన్ ఖాన్. 2015 నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన సమయంలో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారాయన. బీటౌన్ నటుడిగా రాణిస్తానో లేదోనన్న భయం తనను ఎప్పు డూ వెంటాడేదని చెప్పుకొచ్చారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే ఫేమ్ మాత్రమే కాదు.. చాలా ఇబ్బందులూ ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో నటీమణులే చర్మ సౌందర్యంపై దృష్టి సారించేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శారీరక ఆకృతి విషయంలో నటులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.

లుక్స్ విషయంలో పురుషులకు కూడా ఒత్తిడి ఉంటుంది.. ఎప్పుడూ అందంగా కనిపించాలని వారూ అనుకుంటారు. ఇందుకోసం జాగ్రత్తలు పాటిస్తుంటారు. కొన్నిసార్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. నేను నటుడిగా ఉన్నప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హీరో లుక్‌లో కనిపించడం కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నా. అయితే, శరీరాన్ని నిలబెట్టుకోవటంలో అలాంటి రసాయనాలు పనిచేయవని ఆఖరికి గ్రహించా’ అని చెప్పాడు ఇమ్రాన్.