పొలం గట్టు సంగతులు
18-05-2026 12:00 AM
పొలం గట్టు మీద నిలబడితే
గాలి చెంపను తాకి
చెవిలో ఏదో చెప్పింది..
చెట్టు ఆకులు ఊగుతూ
మనసుకు ఉల్లాసాన్నిచ్చే
కొమ్మ కింద పిట్టగూడు
అందులోనే పసికందు
జోలపాట లేదులే
అమ్మ పిలిస్తే రాదులే
ఉడుత పిల్లల గంతులు
కోడి పిల్ల కూతలు
కుందేలు నడకలు
గడ్డివామి దిబ్బలు
ఎండు గడ్డి.. లేత గడ్డి
అందులో నడక దారి
ఊరి చివర చెరువులోన
కొంగ బావ ఆసనాలు
తాటిచెట్టు కొమ్మ పైన
కోతి చేసే విన్యాసాలు
తుమ్మచెట్టు పువ్వులు
అందమైన సోయగాలు
సాయంత్రం పొలంగట్టు
సంగతులు మరెన్నో !!






