ఇంట్లో ఏదయినా శుభకార్యం జరుగుతున్న ప్పుడూ లేదా పూజలాంటిది పెట్టుకున్నప్పుడూ చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని మిగిలిన పనులు చక్కబెట్టడం అంటే కాస్త ఇబ్బందే. అలాగ ని దాన్ని ఎవరి చేతికీ ఇవ్వలేం. ఎక్కడా పెట్టలేం. ఈ అవసరాన్ని అర్థం చేసుకుని “సిల్వర్ క్లచ్ వ్యాలెట్ మొబైల్ పౌచ్ విత్ హూక్’ పేరుతో వెండి సెల్‌ఫోన్ పౌచ్‌లను తీసుకొచ్చారు. జ్యువెలరీ డిజైనర్లు. అచ్చం గా వెండితో తయారుచేసిన ఈ సెల్‌ఫోన్ పౌచ్‌కు చిన్న హుక్కులాంటిది ఉంటుంది.
పౌచ్‌లో సెల్‌ఫోను వేసుకొని.. వెండి తాళాలగుత్తి తరహాలో దానికి ఉండే హుక్కును నడుముకు తగిలించుకోవచ్చు. చూడ్డానికి వెండి పర్సులా కనిపించే ఈ పౌచ్‌నూ దానికి వచ్చే హుక్కునూ కూడా.. ట్రెండీగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. వీటిలో రాళ్లు పొదిగినవీ.. సెల్‌ఫోన్ పడిపోకుండా పర్సు తరహాలో ఉన్నవీ దొరుకుతున్నాయి. కాబట్టి మీకేం నచ్చిందో చూసేయండి మరి..