8 May, 2026 | 10:15 AM

షూటింగ్‌లో గాయపడిన కార్తి

05-03-2025 12:00 AM

తమిళ హీరో కార్తి ఓ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మైసూర్‌లో ఉన్నాడు. కార్తి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘సర్దార్ 2’. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కొన్ని కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్తి కాలికి గాయమవడంతో చిత్ర యూనిట్ హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

దీంతో కార్తి సినిమా షూటింగ్ ఆపేసి చెన్నైకి వెళ్లిపోయాడు. 2022లో ‘సర్దార్’ చిత్రం విడుదలై ఎంత మంచి సక్సెస్ సాధించిందో సినీప్రియులకు చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గానే ‘సర్దార్ 2’ రూపొందుతోంది. ఇందులో కార్తి, రజిషా విజయన్‌తో పాటు ఎస్‌జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే కార్తి ‘ఖైది 2’ షూటింగ్‌ను మొదలు పెట్టనున్నాడు.