8 May, 2026 | 9:22 AM

పౌరసత్వం వార్తలను ఖండించిన చిరు టీమ్

05-03-2025 12:00 AM

సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు ఏం చేసినా దానికి ఓ కారణాన్ని ఊహించి సోషల్  మీడియాలో ప్రచారం చేయడం సర్వసాధారణమైం ది. ప్రస్తుతం చిరంజీవిపై ఈ విధంగానే రూమ ర్ వచ్చింది. ఆయన చేసిందల్లా లండన్ వెళుతున్నట్టు చెప్పడమే. దీంతో ఆయన సిటిజెన్‌షిప్ కోసమే లండన్ వెళుతున్నారం టూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిని తాజాగా ఆయన టీమ్ ఖండించింది.

అసలేం జరిగిందంటే.. విశ్వక్‌సేన్ మూవీ ‘లైలా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో లండన్ వెళ్లనున్నట్టు చిరంజీవి తెలిపారు. అక్కడ జరుగనున్న ఓ ఈవెంట్‌లో తనకు సన్మానం జరగనుందని వెల్లడించారు. అయితే ఆయన యూకే సిటిజెన్‌షిప్ కోసమే లండన్ వెళుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

దీనిపై చిరంజీవి టీమ్ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. అలాంటి వార్తలు రాసే ముందు ధృవీకరించుకోవాలని హితవు పలికింది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నారు.