హ్యాపీ బర్త్డే
వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు నేడు. ఆమె 5 మార్చి 1985న బెంగుళూరులో జన్మించింది. ఆమె 2012లో ‘పోడా పోడి’ అనే తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ అనే చిత్రం ద్వారా 2019లో టాలీవుడ్‌కు పరిచయమైంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలోనూ వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. ‘హనుమాన్’ చిత్రం ఆమెకు టాలీవుడ్ మంచి పేరు తెచ్చిపెట్టింది.
నటుడు నాజర్ పుట్టినరోజు నేడు. ఆయన 5 మార్చి 1958లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కంలో జన్మించారు. 1977లో అవకాశాల కోసం మద్రాస్‌కు వచ్చారు. కోరమాండల్ హోటల్‌లో పని చేస్తూ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టాలీవుడ్‌లో వచ్చిన ‘మాతృదేవోభవ’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘బాంబే, జీన్స్, అతడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నాజర్ చాలా దగ్గరయ్యారు.
ఇవాళ సెల్వరాఘవన్ పుట్టినరోజు. ఆయన మార్చి 5 1977లో చెన్నైలో జన్మించారు. తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన ‘తుళ్లువదో ఇల్లమై’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేశారు. తరువాత వరుసగా ‘కాదల్ కొండేన్, 7/జీ బృందావన్ కాలనీ’ చిత్రాలు తీశారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.






