పాక్‌లో పెట్రో మంట
- ఆకాశాన్నంటిన ధరలు
- డీజిల్ లీటర్ రూ. 520.35, పెట్రోల్ రూ. 458.40
ఇస్లామాబాద్, ఏప్రిల్ 3: అసలే ఆర్థిక అగాధంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ప్రజలకు మరింత షాక్ తగిలింది. శుక్రవారం నుంచి పెట్రో ధరల ను పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ప్రకటించా రు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పడంతో ధరలు పెంచడం తప్పనిసరైందన్నారు. డీజిల్‌పై 54.9 శాతం పెరుగగా, అది లీటర్‌కు రూ. 520.35 చేరుకుంది.
పెట్రోల్ 42.7 శాతం పెరుగగా, అది లీటర్‌కు రూ. 458.40 (పాక్ కరెన్సీ)కు చేరింది. పాత ధరలు డీజిల్ లీటర్‌కు రూ. 335, పెట్రోల్ 321 ఉండేవి. కాగా యుద్ధం కారణంగా గత నెలలోనే పాక్ డీజిల్, పెట్రోల్ ధరలను 20 శాతం మేర పెంచిం ది. తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, దేశంలోని పేద ప్రజలపై భారాన్ని మరింత పెంచుతుందని అంచనా. పాక్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈల నుంచి హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతున్న చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది.
ఆర్థికమంత్రి మ హ్మద్ ఔరంగజేబ్ మాట్లాడుతూ.. గత మూడు వారాలుగా ప్రభుత్వం 129 బిలియన్ రూపాయల సబ్సిడీలను అందించి నప్పటికీ, ఇప్పుడు కొనసాగించడం సాధ్యంకాదని చేతులెత్తేశారు. దేశంలో మరిన్ని పొదుపు చర్యలను కూడా ప్రకటించారు. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వ కా ర్యాలయాలకు వారానికి నాలుగు రోజులే పనిదినాలుగా మార్చారు.
పాఠశాలలకు సెలవులు పొడిగించడమే కాకుండా కొన్ని తరగతులను ఆన్‌లైన్ మోడ్‌కు మార్చారు. పాకిస్తాన్‌లోని 24 కోట్ల జనాభాలో 25 శాతం మంది కటిక పేదరికంలో ఉండగా, వారికి ఈ ధరల పెరుగుదల ఆహార సంక్షోభాన్ని తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) హెచ్చరించింది.




