12 July, 2026 | 3:41 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

తమిళనాడు గజగజ

02-12-2024 03:41 AM

ఫెంగల్ ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు

నీట మునిగిన అనేక జిల్లాలు.. స్తంభించిన జనజీవనం

చెన్నైలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

పుదుచ్చేరిపై తీవ్ర ప్రభావం 

44 సెం.మీ వర్షపాతం నమోదు

౩౦ ఏళ్ల రికార్డు బ్రేక్ 

చెన్నై, డిసెంబర్ 1: తీవ్ర తుఫాన్‌గా ఫెంగల్ తమిళనాడు, పుదుచ్చేరిలో బీభత్సం సృష్టిస్తోంది. శనివారం రాత్రి తుఫాన్ తీరం దాటగా 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తమిళనాడులోని చాలా జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. 30 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ ఒక్కరోజులోనే 44 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో తీర ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి.

తమిళనాడు, పుదుచ్చేరిలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నైని కూడా వరదలు ముంచెత్తాయి. చెన్నైలో జరిగిన వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతం కారణంగా ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాలేదని అధికారులు వెల్లడించారు. 

పుదుచ్చేరిలో 100 మందిని కాపాడిన ఆర్మీ

ఫెంగల్ తుఫాను కారణంగా పుదుచ్చేరి తీవ్రంగా ప్రభావితమైంది. నగరంలోని చాలా చోట్ల ఇళ్లు నీట మునిగాయి. తుఫాన్ పుదుచ్చేరిని తాకిన వెంటనే దాదాపు 47 సెం.మీ. వర్షపాతం నమోదైంది. విల్లుపురం జిల్లాలో 50 సెం.మీ, కడలూరులో 18 సెం.మీ, మరకానాలో 23.8 సెం.మీ వర్షపాతం రికార్డయింది. తుఫాన్ తీరం దాటినప్పటికీ పుదుచ్చేరితో పాటు మామల్లపురంలో తీవ్ర గాలుల కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.

చాలా ప్రాంతాలు జలమయం కావడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న 100 మందికిపైగా ప్రజలను కాపాడారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకూలాయి. పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలను మూసేశారు. 

అదుపు తప్పిన విమానం 

తుఫాన్ ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. నగరంలో చాలా ప్రాం తాల్లో వరదనీరు పోటెత్తింది. చెన్నై ఎయిర్‌పోర్టులోనూ నీరు చేరడం తో శనివారం విమానాశ్రయాన్ని మూ సివేశారు. వరద ప్రభావం తగ్గడంతో ఆదివారం మధ్యా హ్నం 1 గంటలకు మళ్లీ సేవలు ప్రారంభించారు. ఈ క్రమంలో సేవలను ఇండిగో ఎయిర్‌లైన్స్ తిరిగి ప్రారంభించింది. అయితే చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కావాల్సిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అదుపుతప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ గాల్లోకి ఎగిరించి తర్వాత సేఫ్ ల్యాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.