21-01-2026 04:34:54 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరిని బదిలీ చేస్తూ మున్సిపల్ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధారణ బదిలీ జరిగినట్టు సమాచారం. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు ఆయనను బదిలీ చేయగా ఆయన స్థానంలో యాదగిరి బాధ్యతలు చేపట్టారు. కొద్దికాలంలోనే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేసి యాదగిరి పట్టణ ప్రజల అభినందనలు పొందారు. యాదగిరి స్థానంలో నూతన కమిషనర్ గా ఎవరు వస్తున్నారో అనేది తెలియాల్సి ఉంది.