23 March, 2026 | 9:33 PM

ఫైనల్లో తన్వీ

25-08-2024 12:30 AM

న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ తన్వీ పత్రీ సత్తా చాటింది. అండర్‌15 బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తన్వీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో తన్వీ 21 21 కకానిక్ (థాయ్‌లాండ్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో తన్వీ రెండో సీడ్, వియత్నాంకు చెందిన గెయెన్ తితూను ఎదుర్కోనుంది. అండర్ 17 పురుషుల సింగిల్స్‌లో జ్ఞానదత్తు కాంస్య పతకం గెలుచుకున్నాడు. సెమీస్‌లో జ్ఞానదత్తు ఇండోనేషియాకు చెందిన రాదిత్యా బయూ చేతిలో ఓటమి చవిచూశాడు.